Site icon NTV Telugu

Sky Movie: చివరి దశలో ఒంటరి వ్యక్తి జీవిత కథ!

Sky

Sky

Sky Movie: సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సినిమా ‘స్కై’. పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి పని చేస్తుండడం గమనార్హం! ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ఈ మూవీ గురించి దర్శకుడు పృథ్వీ పేరిచర్ల మాట్లాడుతూ, ”ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది” అని తెలిపారు. ‘చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని, తెలుగువారంతా గర్వపడే చిత్రంగా దీనిని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామ’ని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటున్న ఈ విభిన్న కథా చిత్రానికి మాటలు మురళీ కృష్ణంరాజు, పృథ్వి పేరిచర్ల; సంగీతం శివ అందిస్తున్నారు.
Jagga Reddy Counter to Sharmila: మూడు రాష్ట్రాలు చేయండి.. ముగ్గురూ పంచుకోండి

Exit mobile version