ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీలో టాలీవుడ్ కార్మికుల చేస్తున్న బంద్ వివరాలను మంత్రికి వివరించారు నిర్మాతలు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు దుర్గేష్. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని సూచించారు మంత్రి దుర్గేష్. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ప్రత్యేక చర్చలు జరిపి ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పై మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
Also Read : Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
నిర్మాతలతో భేటీ విషయమై కందుల దుర్గేష్ మాట్లాడుతూ ” ఏపీ లో సినిమా షూటింగ్ స్పాట్స్ అభివృద్ధి,లొకేషన్స్,స్టూడియోస్ రీ రికార్డింగ్స్, స్టూడియో నిర్మాణం ఫై నిర్మాతలతో చర్చ జరిగింది. స్టూడియో నిర్మాణాలు జరిగితే యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సినిమా కి సంబంధించి ఏపీ లో స్కిల్ అభివృద్ధి జరగాలి. యువతకి సినిమా ల ఫై స్కిల్ పెంచడం తో వారికీ అవకాశాలు ఉంటాయి. అందరు కలిసి ఏపీ లో పరిశ్రమని ఎలా అభివృద్ధి చేయాలనేది చర్చ జరిగింది. ఫ్రెండ్లీ వాతావరణంలో ఏపీ లో చిత్ర పరిశ్రమ ఉండాలనేది అందరి ఆకాంక్షసీఎం, డిప్యూటీ సీఎం తో సమావేశం ఏర్పాటు చేయాలనీ అడిగారు. నంది అవార్డ్స్ పైన కూడా చర్చ జరిగింది. ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ ఇస్తాం. దీని మీద రెండు, మూడు ప్రతిపాదనలు అలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డ్స్ అనే పేరు ఉంది. ఏపీలో నంది అవార్డ్స్ పేరు మార్చే ఆలోచన లేదు’ అని అన్నారు.
