Site icon NTV Telugu

The Girlfriend: రష్మిక మందన్న బర్త్ డే.. ‘రేయి లోలోతుల’ టీజర్ రిలీజ్

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా నుంచి టీజర్ సాంగ్ ‘రేయి లోలోతుల’ విడుదలైంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న మరియు ప్రతిభావంతుడైన హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అందమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని మరియు విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Muthayya: ఈటీవీ విన్ లో ‘ముత్తయ్య’

ఈ రోజు రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా “ది గర్ల్‌ఫ్రెండ్” టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ , టీజర్ సాంగ్ ‘రేయి లోలోతుల’ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రశ్మిక వారియర్ లుక్‌లో తుపాకీ, కత్తితో శక్తివంతంగా కనిపిస్తుంది. ‘రేయి లోలోతుల’ పాటను సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అద్భుతంగా స్వరపరిచారు, రాకేందు మౌళి ఆకర్షణీయమైన సాహిత్యం అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆకట్టుకునేలా ఆలపించారు. ఈ పాటలోని కవితను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రచించారు. ‘రేయి లోలోతుల’ పాట ఎలా ఉందంటే – ‘రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, ఎద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, ఎద జారెనే మనసా..’ అంటూ ప్రేమ భావనతో నిండిన అద్భుతమైన గీతంగా సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న “ది గర్ల్‌ఫ్రెండ్” త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Exit mobile version