Site icon NTV Telugu

The Face of the Faceless: 21న తెలుగులో ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’

Face Of Face Less

Face Of Face Less

వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read : SKN :‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చున్నీ వివాదంపై ఎస్‌.కె.ఎన్‌ కౌంటర్‌ – “భయాన్ని పోగొట్టమని చేశాం, చున్నీ తీయమని కాదు!”

ఈ సందర్బంగా ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు. రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది, ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసింది. ఈ చిత్రం సీనియర్ రాణి మరియా వట్టలిల్ ఎదుర్కొన్న కష్టాల గురించి. ఆమె అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసింది. ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్‌లో విన్సీ అలోషియస్ సీనియర్ రానియా మరియా పాత్రను పోషించారు.

Exit mobile version