సినిమా రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలు ప్లాప్ అవడం కొత్తేమీ కాదు కానీ పెట్టిన పెట్టుబడి మొత్తం పొతే.. వందల కోట్ల రూపాయాలు బూడిద పాలైతే.. నిర్మాతలు నిండా మునిగిపోతే.. ప్రస్తుతం అదే జరిగింది ఓ సౌదీ కమ్ బ్రిటిష్ కమ్ హాలీవుడ్ సినిమా విషయంలో. ‘డెసర్ట్ వారియర్‘ ఆంథోనీ మాకీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ, బెన్ కింగ్స్లీ నటించిన ఈ సినిమాకు రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించగా జెర్మీ బోల్ట్ నిర్మించారు. ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. డిజాస్టర్ కూడా కాదు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా సృష్టించిన నష్టం మాత్రం హాలీవుడ్ చరిత్రలోనే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. దాదాపు 150 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 4.72 లక్షల డాలర్లు అంటే సుమారు రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మారింది. నిర్మాణంలో జరిగిన జాప్యంతో పాటు అంతర్గత వివాదాల కారణంగా ఈ సినిమా బడ్జెట్ అదుపుతప్పింది. సౌదీ అరేబియా, బ్రిటన్, మరియు అమెరికా దేశాల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎడిటింగ్ టేబుల్‌పైనే చాలా కాలం ఉండిపోయింది.
నిర్మాణ సంస్థకు, దర్శకుడికి మధ్య వచ్చిన విభేదాల కారణంగా సినిమాను పలుమార్లు రీ-షూట్ చేయడమే కాకుండా బయటి నుండి మరో ఎడిటర్‌ను తీసుకొచ్చి సినిమాను పూర్తిగా మార్చేశారనే వార్తలు ఉన్నాయి. దీనివల్ల దర్శకుడు అనుకున్న అసలు కథకు థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కు చాలా తేడా వచ్చిందని సమాచారం. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా ప్రమోషన్లు కూడా నామమాత్రంగానే జరిగాయి. పెట్టిన పెట్టుబడిలో 1 శాతం కూడా వసూలు చేయలేకపోవడంతో ఈ చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నమోదైంది.
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
