NTV Telugu Site icon

Thandel : తండేల్ దుల్లకొట్టే డేట్ వచ్చేసింది

Thandel

Thandel

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సగర్వంగా సమర్పించబోతున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

SDT 18: ధరమ్ తేజ్ సినిమాలో జగపతిబాబు.. భయపెడుతున్నాడే!

ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నాచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి రేపు ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఫిబ్రవరి 7వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ ప్రెస్ మీట్ హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో జరగనుండగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అనేక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.

Show comments