Site icon NTV Telugu

Daaku Maharaj: థమన్ అంటే అంతేరా.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే!

Thaman

Thaman

మామూలుగానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఒక రేంజ్ లో కొడతాడు. దానికి తోడు అది నందమూరి బాలకృష్ణ సినిమా అని తెలిస్తే దాని ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. ఇదే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ కి బాలకృష్ణ హాజరైన తర్వాత సినిమాలోని కొన్ని పాటలు ప్లే చేసి చూపించారు. ఆ సందర్భంలో రేజ్ ఆఫ్ డాకు అనే సాంగ్ ప్లే చేసి ముగిస్తున్న సమయంలో స్పీకర్లు ఒక్కసారిగా కింద పడిపోయాయి. దీంతో వెంటనే నిర్వాహకులు వాటిని సర్దుకోవాల్సి వచ్చింది. దీంతో వెంటనే సుమ కల్పించుకుని బాలకృష్ణ సినిమా అంటే తమన్ బాక్సులు బద్దలు కొడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అది ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ అయింది అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version