ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సివోవో గోపి పాల్గొన్నారు. ‘బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గోవాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది’ అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ప్రెస్ మీట్ లో భాగంగా థమన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముందు బాలయ్య ఈ విషయం గురించి చెప్పారని, తరువాత ట్రస్ట్ నుంచి కాల్ రాగానే వెంటనే ఒప్పుకున్నానని అన్నారు.
Venu Swami: నాగచైతన్య, శోభితల జోస్యం.. వేణు స్వామి బహిరంగ క్షమాపణలు
క్రికెట్ లో తాను సంపాదించే డబ్బు కానీ, ఆహా ఇండియన్ ఐడల్ షో, నా కాన్సర్ట్స్,నా షోస్ నుంచి వచ్చే డబ్బు అంతా చారిటీ కే ఇస్తా… ఓన్లీ సినిమా లో వచ్చే డబ్బు మాత్రమే నాకు అని థమన్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు స్థాపించిన ట్రస్ట్ ఎంతగొప్పదో మనం చుస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఫిబ్రవరి 15 మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా, ఈ షోలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. మేడం భువనేశ్వరి చాలా గొప్ప మనిషి, చాలా డౌన్ టు ఎర్త్ వుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మనం చూశాం. ఏపీని ప్రగతిపధం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు ఈ మ్యూజికల్ షోలో సీనియర్ ఎన్టీఆర్ గారి పాటల నుంచి ఇప్పటి ట్రెండ్ పాటల వరకూ అన్నీ వుంటాయని అన్నారు. ఫెబ్రవరి ఫస్ట్ నుంచి రిహార్సల్ చేస్తున్నాం, ఈ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా క్రేజీగా ఉండబోతోంది అన్నారు.