TG Vishwaprasad Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
రవితేజ కాంబినేషన్ లో మీకిది మూడో సినిమా.. ధమాకా రేంజ్ లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా?
-రవితేజ గారితో సిరీస్ అఫ్ మూవీస్ చేస్తాం. హరీష్ శంకర్ తో కొంతకాలంగా ట్రావెల్ అవుతున్నాం. రవితేజ గారు, హరీష్ లది వెరీ క్రేజీ కాంబినేషన్. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా మిస్టర్ బచ్చన్ ధమాకా ప్లస్ లా వుంటుంది. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ మూవీ.
ఆగస్టు 15కి రావాలని ముందే అనుకున్నారా?
-సినిమా స్టార్ట్ చేసినప్పుడు మే, జూన్ లో పూర్తి చేయాలని ప్లాన్. రిలీజ్ డేట్ అన్నది షెడ్యూల్ ప్రకారం ప్లాన్ ఇవ్వాలి అనుకున్నాం. ఒరిజినల్ గా ఆగస్టు 9 రిలీజ్ డేట్ అనుకున్నాం. అయితే మా సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మొదట్లో డేట్ ఇవ్వలేదు. పుష్ప స్లాట్ క్లియర్ అవ్వడంతో ఆగస్టు 15 ది బెస్ట్ అని డేట్ ఇవ్వడం జరిగింది.
-ఆగస్టు 15కి రెండు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వున్నాయి. ఈ రెండికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండికి బెటర్ అవుట్ పుట్ ఈ సీజన్ లో వస్తుంది. లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది.
మిస్టర్ బచ్చన్ మీరు అనుకున్న బడ్జెట్ లో అయ్యిందా ?
-రవితేజ, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండాలో అంత గ్రాండ్ గా తీశాం. మేము అనుకున్న బడ్జెట్ లో సినిమా అయ్యింది.
హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవడానికి కారణం ?
-ఇట్స్ డైరెక్టర్స్ కాల్. భాగ్యశ్రీ బోర్సే చాలా చక్కగా నటించారు.
రవితేజతో మరో సినిమా చేసే ప్లాన్ ఉందా ?
– ఒక నెంబర్ అని అనుకోలేదు. రవితేజ గారితో కంటిన్యూ వర్క్ చేస్తూ వుంటాను.
మిస్టర్ బచ్చన్ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ గురించి ?
-మిక్కీ, హరీష్ కి ఎక్స్ ట్రార్డినరీ సింక్ వుంది. వాళ్ళిద్దరూ కూర్చుని సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
మీరు హాలీవుడ్ ని చాలా దగ్గరగా పరిశీలించారు కదా.. అక్కడ టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన ఉందా?
-తీసుకురావాలనే నా ఆలోచన. ఇప్పటికే మా ప్రొడక్షన్ కొంత టెక్నాలజీ అడాప్ట్ చేశాం.
ఒక ఫ్యాక్టరీ మోడల్ లో మొదలుపెట్టారు కదా.. కానీ ఇప్పుడు మార్కెట్ కండీషన్స్ డిఫరెంట్ గా వున్నాయి. ఈ విషయంలో ఆ టార్గెట్ స్లో అయ్యిందా?
-లేదండీ. ఇప్పుడు మా నుంచి 15 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దాదాపు పది సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. అలా నెక్స్ట్ టూ, త్రీ ఇయర్స్ ఈ లైనప్ ఉంటుంది.
మిస్టర్ బచ్చన్ ప్రిమియర్స్ ఉంటాయా ?
-ప్రిమియర్స్ కన్ఫర్మ్ గా వుంటాయి.
రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి ?
-G2, మిరాయ్, రాజా సాబ్, సన్నీ డియోల్ లో హిందీ మూవీ జరుగుతున్నాయి. కన్నడలో గణేష్ అనే యాక్టర్ తో 50 కోట్ల స్పాన్ వున్న మూవీ చేస్తున్నాం. ఇంకో మూడు కన్నడ సినిమాలు వున్నాయి. తెలుగు నాలుగైదు సినిమాలు వున్నాయి. విశ్వక్ సేన్, అనుదీప్ మూవీ, దీంతో పాటు ఈ ఏడాది మొదలయ్యే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. ఇవి కాకుండా యూఎస్ లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం.
-విశ్వం, స్వాగ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
-ఓటీటీ రిలీజ్ ఓ ఐదు సినిమాలు రెడీగా ఉన్నాయి.
రాజా సాబ్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది ?
-దాదాపు 50 పర్సెంట్ పైనే పూర్తయింది. ఈ ఇయర్ ఎండ్ లోగ షూటింగ్ పూర్తయిపోతుంది.