టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తొలిసారిగా ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. అలా వరుస అవకాశాలు అందుకుంటూ, సుహాస్ నటించిన చాలా సినిమాలు కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా సుహాస్ తో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
Also Read : Retro : సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్..
తాజాగా హీరో సుహాస్‌కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే కోలీవుడ్ నటుడు సూరి హీరోగా ‘మండాడి’ మూవీలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్‌రెడ్ కుమార్ తన ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా, ఆయన శిష్యుడు, మణి మారన్ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ కధనాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ద్వారా సుహాస్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారట. ఈ మూవీలో సుహాస్ చాలా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. కాగా త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో తాజాగా ప్రోమోను కూడా విడుదల చేశారు.
