Site icon NTV Telugu

Film Chamber: తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం.. టికెట్ రేట్లపైనా?

Film Chamber

Film Chamber

Film Chamber: టాలీవుడ్‌ సమస్యలు పరిష్కారం కోసం వరుస సమావేశాలు జరుగుతూనే వున్నాయి. అయినా ఇప్పటి వరకు సమస్యలపై క్లారిటీ రాలేదు. దీంతో సమస్యలు పరిష్కారం దొరకేంత వరకు షూటింగ్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ , ఫిలిం ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ మొదలువారితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ.. టాలీవుడ్‌ సమస్యలు, ప్రజలకు థియేటర్లకు రప్పించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నాయి.

read also: Cheating: హైదరాబాద్‌ లో ఘరానా మోసం.. రూ.16.10కోట్లు కాజేసిన తండ్రీకొడుకులు

అయితే.. ఇటీవలే ఫిలిం ఛాంబర్ మల్టీప్లెక్స్ ప్రతినిధులతో టికెట్ రేట్లపై, స్నాక్స్ రేట్లపై సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. దీంతో ఇవాళ ఆగస్టు 7న ఫిలిం ఛాంబర్ లో ఉదయం 11 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. అయితే.. ఈ సమావేశంలో పర్సెంటేజ్ విధానం, వీపీఎఫ్ చార్జీలు, టికెట్ రేట్ల గురించి చర్చ జరగనుంది. ఈనేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అయిపోయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో డిస్ట్రిబ్యూటర్ల కమిటీ మరో సమావేశం నిర్వహించనున్నారు. అయితే.. ఈ సమావేశం మంచి ఫలితాలని ఇస్తుందని ఆశిస్తున్నారు. దీంతో.. టికెట్ రేట్లు తగ్గించే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్వనీయ సమాచారం.
Asia Cup: ఆసియా కప్‌ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక బౌలర్ దూరం

Exit mobile version