Site icon NTV Telugu

NBK : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్య‌మంత్రి

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ‌-2. ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జాజికాయ జాజికాయ భారీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 5న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది.

Also Read : AR Rahman : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఏఆర్ రెహమాన్ సాంగ్స్

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీమ్. అందులో భాగంగానే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వేడుకను భారీ ఎత్తున టాక్ ఆఫ్ టౌన్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 28న నిర్వహించబోయే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఇందుకు సంబంధించి అనౌన్స్ మెంట్ కూడా రాబోతుంది. అలాగే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా మ‌రో అతిథిగా పిలిచేందుకు ప్లాన్ చేశారట మేకర్స్. కానీ బ‌న్నీ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వ‌ల్ల రావడం కుద‌ర‌డం లేదట. సినిమా రిలీజ్ అయ్యాక స‌క్సెస్ మీట్ కి బ‌న్నీ వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు  డిసెంబ‌రు 4న రాత్రి నుంచే ప్రీమియ‌ర్లు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గ అనుమ‌తుల కోసం నిర్మాత‌లు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version