Site icon NTV Telugu

Barabar Premistha: ‘బరాబర్ ప్రేమిస్తా’నంటున్న ఆటిట్యూడ్ స్టార్

Barabar Premistha News

Barabar Premistha News

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా “బరాబర్ ప్రేమిస్తా “. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు.మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

Upendra : టాలీవుడ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేసిన ఉపేంద్ర

ఈ టీజర్ పరిశీలిస్తే “బరాబర్ ప్రేమిస్తా ” టీజర్ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా ఆసక్తికరంగా కథా కథనాలు ఉన్నాయి . పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. హీరో చంద్రహాస్ రోల్ పవర్ పుల్ గా ఉంది. హీరోయిన్ మేఘనా ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేసింది. హీరో చంద్రహాస్, ప్రతినాయకుడు అర్జున్ మహీ మధ్య టగ్ ఆఫ్ వార్ ఆకట్టుకుంది. చంద్రహాస్ చెప్పిన ‘ నువ్వు నన్ను కొడతాంటె నొప్పి నీ కళ్లలో తెలుస్తుందేంట్రా..’ డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. బీజీఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్ టాప్ క్వాలిటీతో ఉన్నాయని చెప్పొచ్చు.

Exit mobile version