ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ హార్ట్ ఎటాక్ తో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఐసియులో చికిత్స పొందుతున్న వివేక్ గురువారమే కోవిడ్ కి వాక్సిన్ కూడా తీసుకున్నారు. అందరూ ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు వివేక్. కోవాక్సిన్ తో పాటు కోవీషీల్డ్ కూడా మనకు కోవిడ్ రాకుండా చేయలేనప్పటికీ… కోవిడ్ ప్రమాదస్థాయిని తగ్గిస్తాయని అన్నారు వివేక్. వందలాది చిత్రాల్లో నటించిన వివేక్ ని భారతప్రభుత్వం 2009లో పద్మశ్రీతో గౌరవించింది.
నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్
