Site icon NTV Telugu

Tamil Actress Srinivasan : రూ.5 కోట్లు మోసం – తమిళ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్

Srinivasan

Srinivasan

తమిళ సినీ పరిశ్రమలో “పవర్ స్టార్”గా గుర్తింపు పొందిన ఎస్. శ్రీనివాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థను మోసం చేసిన ఆరోపణలపై ఆయనను ఢిల్లీ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 2010లో ‘బ్లూ కోస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్’ అనే సంస్థకు రూ.1000 కోట్లు లోన్ ఇప్పిస్తాన‌ని శ్రీనివాస‌న్ హామీ ఇచ్చాడట. దీనికి బ‌దులుగా.. వారి దగ్గర నుంచి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

Also Read : Mrunal Thakur : ‘డెకాయిట్’ టీమ్ ప్లాన్ అదుర్స్.. మృణాల్‌కు ఎమోషనల్ సర్‌ప్రైజ్

నెల రోజుల్లో లోన్ వ‌స్తుంద‌ని రాక‌పోతే డ‌బ్బులు తిరిగిఇస్తాన‌ని హామీ ఇచ్చాడు. అయితే నెల కంటే ఎక్కువ‌ రోజులు గ‌డుస్తున్న లోన్ మంజూరు కాక‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించిన‌ సంస్థ యాజ‌మాన్యం పోలీసుల‌ను ఆశ్రయించింది. అయితే ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రూ. 5 కోట్లు నేరుగా శ్రీనివాసన్, అతని భార్య బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. అంతేకాదు ఈ డ‌బ్బుని అత‌డి వ్యక్తిగ‌త అవసరాల కోసంతో పాటు సినిమాల నిర్మాణానికి ఉప‌యోగించిన‌ట్లు తేలింది. ఇక ఈ కేసులో దర్యాప్తునకు సహకరించకుండా, విచారణకు హాజరుకాకుండా 2018 నుంచి శ్రీనివాస‌న్ త‌ప్పించుకుని తీరుగుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. దీంతో కోర్టు అత‌డిని నేర‌స్థుడి‌గా ప్రక‌టించింది. తాజా స‌మాచారం ప్రకారం అతడు చెన్నైలో ఉన్నట్లు తెల‌వ‌డంతో అత‌డిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.

Exit mobile version