NTV Telugu Site icon

Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..

Tamannah

Tamannah

Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన అందం ,నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.వరుసగా గ్లామర్ పాత్రలు చేస్తూనే యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలలో కూడా నటిస్తుంది.ఈ భామ సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా ఎంతగానో అలరిస్తుంది.రీసెంట్ గా బోల్డ్ సీన్స్ లో నటించకూడదని నియమాన్ని ఈ భామ బ్రేక్ చేసింది.ఈ భామ హిందీలో నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

Read Also :Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..

ప్రియుడు విజయ్ వర్మ తో ఈ భామ చేసిన బోల్డ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంపై తమన్నా హాట్ కామెంట్స్ చేసింది .లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ చూసిన తరువాత బోల్డ్ సీన్స్ పై నా అభిప్రాయం మారిపోయింది .బోల్డ్ గా నటిస్తే తప్పు ఏంటి అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను.ప్రేక్షకులు నన్ను అలాంటి సీన్స్ లో చూడాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే లస్ట్ స్టోరీస్ 2 లో బోల్డ్ గా నటించానని ఆమె చెప్పుకొచ్చింది.ప్రేక్షకులు నన్ను ఎలాంటి పాత్రలో చూడాలి అనుకుంటున్నారో అలాగే కనిపించాలి .నటిగా అది నాకు అవసరం అని తమన్నా తెలిపింది.

Show comments