NTV Telugu Site icon

మరో వెబ్ సిరీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్…!

Tamannaah Bhatia Signed for another web series in Telugu

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘లెవెన్త్ అవర్’తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్‌ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’లో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం కల్పించినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కాగా తమన్నా ‘ఆహా’ కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది. డిజిటల్ రంగంలో మొదటి వెబ్ సిరీస్ తోనే పరాజయం చవి చూసిన ఈ అమ్మడు ఇటీవలే ‘ఆహా’లో తన తదుపరి వెబ్ షో కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే…. గోపీచంద్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’లో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా నితిన్ తో అంధాదున్ తెలుగు రీమేక్ లో, సత్యదేవ్ సరసన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో నటిస్తోంది.