Site icon NTV Telugu

LION KING: ‘ముఫాసా ది లయన్ కింగ్’ కోసం టాలీవుడ్ కింగ్..

Untitled Design (7)

Untitled Design (7)

అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది, 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. మరియు అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

Also Read: Pushpa : విభేదాలకు చెక్ పెట్టేందుకు ఒకే వేదికపైకి బన్నీ- సుక్కు..

ఈ అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా మాట్లాడుతూ “డిస్నీ యొక్క బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను, ముఫాసా పాత్రకు వాయిస్ ఇవ్వడం సంతోషంగా ఉంది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఎంజాయ్ చేసే ఫీలింగ్. డిసెంబర్ 20న తెలుగులో సిల్వర్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్‌ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు ఎప్పుడు చూస్తారోనని ఎదురు చూస్తున్నాను” అని అన్నారు. తమకు నచ్చిన భాషలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించడం మా లక్ష్యం. ముఫాసా యొక్క ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది మరియు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్‌కి జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు.

Exit mobile version