ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో డి.ఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా… ఆయన తనయుడు, నటుడు ఎమ్మెల్లేగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాదు కోవిడ్-19పై చేస్తున్న పోరాటానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు సూర్య ఫ్యామిలీ ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సూర్య ఫ్యామిలీ చాటిన ఉదారతపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తమిళనాడు సీఎంను కలిసిన సూర్య ఫ్యామిలీ… కోటి విరాళం…!
