Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?

Suriya Maniratnam

Suriya Maniratnam

కోలీవుడ్ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలయికలో మరొక భారీ చిత్రం రాబోతుందనే వార్తలు నెట్టింట తీవ్రంగా హల్ చల్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘యువ’ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘ఇంజి వెల్లమ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సూర్యతో కలిసి పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

దాదాపు 8 ఏళ్ల క్రితం ఈ కాంబోసెట్ కావాల్సి ఉంది. అప్పట్లో మణిరత్నం సూర్యకు ఒక అద్భుతమైన లైన్ వినిపించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు అదే కథకు నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కొన్ని ముఖ్యమైన మార్పులు-చేర్పులు చేసి, సూర్యకు మళ్లీ నరేషన్ ఇచ్చేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారట. సూర్య ఈ మోడిఫైడ్ వర్షన్ స్క్రిప్ట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తే ఈ కలయిక అధికారికంగా ఖరారవుతుంది. ప్రస్తుతం సూర్య సీన్ సినిమా చేస్తున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఆ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. అయినప్పటికీ మణిరత్నం వినిపించే కొత్త కథ గనక సూర్యకు బాగా నచ్చితే, ఈ ప్రాజెక్ట్‌ను తన లైనప్‌లో చేర్చుకుని కాల్‌షీట్స్ కేటాయించే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.