Site icon NTV Telugu

Sukriti Veni: సుకుమార్ కుమార్తెను సన్మానించిన సీఎం రేవంత్

Sukumar

Sukumar

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉత్తమ బాలనటిగా పురస్కారానికి ఎంపికైన సుకృతి వేణితో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, చిత్ర సమర్పకురాలు, సుకుమార్‌ సతీమణి తబితా సుకుమార్‌ ‘గాంధీ తాత చెట్టు’ చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్‌, శేష సింధురావులు సీఏం రేవంత్‌ రెడ్డి ని కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుకృతివేణితో పాటు నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించారు.

Also Read : actor harassing wife: రీల్ హీరో.. రియల్‌లో లైఫ్ విలన్

71 జాతీయ అవార్డ్స్ లో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతివేణి ఆ చిత్రంలో ఉత్తమ నటనకు ఉత్తమ బాలనటిగా పురస్కారం దక్కించుకున్నారు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ , గోపీ టాకీస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేనీ, వై.రవిశంకర్‌, శేష సింధురావులు ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరి హృదయాలను హత్తుకున్న చిత్రంగా ‘గాంధీ తాత చెట్టు’ ప్రశంసలు అందుకున్న సంగతి తెలసిందే

Exit mobile version