Site icon NTV Telugu

Sriranga Neethulu : ఓటీటీ లో అదరగొడుతున్న సుహాస్ శ్రీరంగ నీతులు..

Suhaas

Suhaas

Sriranga Neethulu : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు సుహాస్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇదే సంవత్సరం సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఈ సినిమా విడుదలకు ముందు టీజర్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించింది.

Read Also :Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ మరియు కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు.రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ ఈ సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మే 29 నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాతో పాటు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.ఆహా ఓటిటిలో ఈ సినిమా దూసుకుపోతుంది.అదిరిపోయే వ్యూస్ తో సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా ఓటిటిలో దూసుకుపోతుంది.

Exit mobile version