Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. .ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో మెప్పిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
Read Also :Suriya 44 : ‘సూర్య44’ మూవీ క్రేజీ అప్డేట్ వైరల్..
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అలాగే ఈ సినిమాకు సంబంధించి ఐటెం సాంగ్ కూడా షూట్ చేయాల్సి వుంది.అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో షూటింగ్ లో భాగంగా మేకర్స్ మూవీ టీం కి స్ట్రిక్ కండిషన్ పెట్టారు.ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి టెక్నిషియన్ షూటింగ్ స్పాట్ కు మొబైల్ తీసుకురాకూడదు అని ఆదేశించారు.యూనిట్ కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీ లను ఉపయోగించాలని కోరింది.క్లైమాక్ షూట్ పిక్స్ రివీల్ కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి రూల్ పెట్టినట్లు సమాచారం.