ఇండియాలోనే ప్రముఖ దిగ్గజ దర్శకులలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఆయన సోషల్ మీడియాను ఉపయోగించారు. “ఢిల్లీ విమానాశ్రయానికి లుఫ్తానాసా విమానంలో ఉదయం 1 గంటలకు చేరుకున్నాను. అక్కడ ఆర్టీపిసిఆర్ పరీక్ష ఫామ్ నింపడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది నిలబడి ఫామ్ ఫిల్ చేస్తుంటే, మరికొంత దానికోసం గోడలను ఆసరా చేసుకున్నారు. దరఖాస్తు ఫామ్ లను నింపడానికి టేబుల్ సిస్టం ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : `భీష్మ`ను క్రాస్ చేసేసిన `రంగ్ దే`!
అంతేకాదు ఎగ్జిట్ గేట్ వెలుపల హ్యాంగర్లో చాలా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని అన్నారాయన. మొదటిసారి భారతదేశాన్ని పర్యటించే విదేశీయులకు ఇది అంతం మంచి అభిప్రాయాన్ని కలిగించదని ట్వీట్ చేసి ఢిల్లీ విమానాశ్రయ అధికారుల తీరుపై అసంతృప్తిని వెలిబుచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్ వైరల్ అవుతుండగా… చాలామంది ఆయన ట్వీట్ కు సపోర్ట్ చేస్తూ దాన్ని రీట్వీట్ చేస్తున్నారు. మరికొంతమంది ఢిల్లీ ఎయిర్ పోర్టులో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం “ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రెండు పాటలు షూటింగ్ కోసం పెండింగ్‌లో ఉన్నాయని యూనిట్ ఇటీవల వెల్లడించింది. సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.