Site icon NTV Telugu

శ్రీదేవి సోడా సెంటర్: ఆకట్టుకున్న మెలోడీ సాంగ్..!

పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో సుధీర్ లైటింగ్ సూరిబాబు పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘మందులోడా’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘నాలో ఇన్నాళ్లుగా’ అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వింటుంటే అందమైన ప్రేమ కథ కూడా శ్రీదేవి సోడా సెంటర్ లో చూపించబోతున్నారని పాటను బట్టి తెలుస్తోంది. మణిశర్మ బాణీలు సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సీతారామశాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. దినకర్ – రమ్య బెహర కలిసి ఈ పాటను ఆలపించారు.

Exit mobile version