NTV Telugu Site icon

Sreeleela : పుష్ప -2 ట్రైలర్ కే హైలెట్ గా శ్రీలీల

Sweety (1)

Sweety (1)

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2చిత్రం పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ ఆదివారం పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్ లో పుష్ప – 2 ట్రైలర్ ను లాంఛ్ చేసారు మేకర్స్. ఊహించినట్టుగానే పుష్ప ట్రైలర్ చాలా గ్రాండియర్ గా మాస్ కి మీనింగ్ అంటే ఏంటో చూపెట్టేలా ఉంది. ఇదిలా ఉండగా ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరు టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ట్రైలర్ లో శ్రీలీల కనిపించింది కేవలం ఒకే ఒక షాట్ మాత్రమే. కానీ ఆ ఒకే ఒక ఫ్రేమ్ లో తన అద్భుతమైన డాన్స్ తో స్టెప్ వేసిన విధానం ఆడియెన్స్ తో విజిల్స్ కొట్టిస్తోంది. కిస్సిక్ అంటూ వచ్చే ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ ఇరగతీసిందట శ్రీలీల. మొత్తానికి కనిపించింది ఒకే ఒకఫ్రేమ్ అయిన శ్రీలీల ట్రైలర్ కే హైలెట్ గా నిలిచిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments