Site icon NTV Telugu

Kraven The Hunter: జనవరి 1న క్రావెన్: ది హంటర్

Kraven

Kraven

యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు. “ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను నాయయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం అవసరం. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామం అని నేను భావిస్తున్నాను.” అని అన్నారు.

Sritej Health Bulletin: విషమంగానే శ్రీ తేజ్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోపం, ఆవేశంతో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉన్నాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది: చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశముతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు.” అని చెప్పారు. క్రావెన్: ది హంటర్ సినిమా ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తుందని ఆయన అన్నారు. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథ ని మనం ఇందులో చూడొచ్చు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్స్టర్ తండ్రి నీఙ్కళై తో ఉండే పగ, ప్రతీకారం ఈ సినిమా లో చూడొచ్చని అన్నారు. చాందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version