Site icon NTV Telugu

Devara: సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది..సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

Untitled Design (56)

Untitled Design (56)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయంలో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ అటు ఫ్యాన్స్ ను ఇటు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

దేవర నుండి విడుదలైన ఫియర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. కాగా ఇటీవల దేవర చిత్రం నుండి ఎటువంటి అప్ డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెలిబుచ్చారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవర చిత్రం సెకండ్ లిరికల్ సాంగ్ వీడియోకు సంబంధించిన అప్ డేట్ ఈ రోజు సాయంత్రం రానుందని తెలుస్తోంది. సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నదేవర మొదటి భాగాన్ని దసరా కనుకగా అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. దేవరతో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ -2’లోనూ నటిస్తున్నాడు యంగ్ టైగర్.

Also Read: Allari Naresh : అల్లరోడి సితార సినిమా షూటింగ్ అప్ డేట్..రిలీజ్ ఎప్పుడంటే.?

Exit mobile version