‘దబాంగ్’ ద్వారా పాన్‌ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, స్టార్ కుటుంబానికి చెందినప్పటికీ తన కృషితోనే ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంది. ‘రౌడీ రాథోర్’, ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘హాలీడే: ఏ సోల్జర్ ఇజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ వంటి వరుస విజయాలతో సోనాక్షి తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పరుచుకుంది. గ్లామర్ పాత్రలు చేసిన, కథాబలం ఉన్న సినిమాల పైనే ఫోకస్ చేసిన నటిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతేడాది ‘హీరామండీ’తో తనలోని మరో వైపు బయటపెట్టిన ఆమె, ఇటీవల కాలంలో ‘జటాధర’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి తన ఆలోచనలతో అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోంది. అయితే తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సోనాక్షి సిన్హా తన జీవితానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది.
Also Read : Akhanda 2 : ఈ తరం పిల్లలతో సహా.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ‘అఖండ 2’ : బాలకృష్ణ
“తప్పులు చేయడం అంటే నాకు భయం లేదు. నిజం చెప్పాలంటే, మనం తప్పులు చేస్తేనే.. లైఫ్ ఎక్కువగా నేర్పిస్తుంది. చిన్న పిల్లలు కింద పడి పడి నడక నేర్చుకుంటారు కదా. మనం పెద్దవాళ్ల మైనా అదే. చదువు, కెరీర్, రిలేషన్లు ఏదైనా కావచ్చు ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. కొన్నిసార్లు అవే బెస్ట్ టీచర్లు అవుతాయి. అందుకే ప్రతీ తప్పును నేను ఒక లెర్నింగ్ స్టెప్‌గా చూస్తాను” అని చెప్పింది. భిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం పై కూడా సోనాక్షి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. “భాష ఏదైనా పర్వాలేదు. టాలెంట్ ఉన్న వారితో పని చేయడం నాకు ఇష్టం. కొత్త టీంల నుంచి ఏదో ఒక కొత్త అనుభవం వస్తుంది. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మారే ట్రెండ్స్‌కి అడ్జస్ట్ అవుతూ కొత్త కథలు, కొత్త పాత్రలను ప్రయత్నించడం నా జర్నీని స్పెషల్‌గా మార్చింది” అని పేర్కొంది. మొత్తం మీద సోనాక్షి ..“తప్పులు చేసినా పరవాలేదు… అవే మనల్ని ముందుకు నడిపే మెట్లు.” అని క్లియర్ గా చెప్పుకొచ్చింది.
