Site icon NTV Telugu

Sivakarthikeyan : 300 వందల కోట్ల మైలురాయి అందుకున్నఅమ’రన్’

Amaran

Amaran

శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Keerthy Suresh : కీర్తిసురేష్ పెళ్లి ఎప్పుడు – ఎక్కడంటే..?

అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్కును దాటింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో ఫ్యామిలీ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి.  దీపావళికి రిలీజ్ అయిన సినిమాలలో టాప్ లో నిలిచింది. కేరళ, కన్నడ లోను శివ కార్తికేయన్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచుకుంది అమరన్.  శివకార్తీకేయన్ నటనకు సాయి పల్లవి అభినయానికి ప్రేక్షకులు కంటతడి పెట్టారు. ఇప్పటికి విడుదలై మూడు వారాలు అవుతున్న కూడా అమరన్ డీసెంట్ గా కలెక్షన్ రాబడుతూ దూసుకెళ్తోంది. తాజగా ఈ సినిమా రూ. 300 కోట్లలో క్లబ్ లో చేరింది. శివకార్తికేయన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా అమరన్ నిలిచింది. ఇప్పట్లో మారె ఇతర సినిమాలు లేకుండడంతో అమ’రన్’ ఇప్పట్లో ఆగేలా లేదని ట్రేడ్ టాక్.

Exit mobile version