Site icon NTV Telugu

Singer Chinmayi: నన్ను ఎవరితో పోల్చి చూడాల్సిన పని లేదు..

Chinmayi

Chinmayi

స్టార్ సింగర్ చిన్మయి మీద కోలీవుడ్‌లో కొన్నేళ్ల నుంచి సింగింగ్ అవకాశాలు, డబ్బింగ్ ఆఫర్లు ఇవ్వొద్దని అక్కడ బ్యాన్ ఉందన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కొంత మంది మేకర్లు మాత్రం ఆమెతో పని చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ‘థగ్ లైఫ్’ చిత్రంలోనూ చిన్మయి పాట పాడింది. ఆ పాటను తమిళంలో సింగర్ ధీ ఆలపించగా. తెలుగు, హిందీలో మాత్రం చిన్మయి పాడారు. అయితే థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో, సింగర్ ధీ అందుబాటులో లేక పోవడంతో ఆ పాటను తమిళ్ లో చిన్మయి పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇంత మంచి వాయిస్‌ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యారు.. ఆమె మీదున్న బ్యాన్‌ను తీసేయండని నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు.. అయితే

Also Read : Mrunal Thakur: ఇంత పిసినారి హీరోయిన్‌ని ఎక్కడ చూసి ఉండరు..

తాజాగా దీని మీద చిన్మయి స్పందించింది.. ‘సింగర్ ధీ అందుబాటులో లేకపోవడంతో నేను ఆ పాట పడాల్సి వచ్చింది. ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. కానీ నేను ఈ పాట పాడటం వల్ల మా ఇద్దరి మధ్య రెజ్లింగ్ అన్నట్టుగా పోటీ పెట్టి చూస్తున్నారు, అలా పోల్చాల్సిన అవసరం లేదు. ఇది ఎంత మాత్రం పోటీ కాదు. ఎందుకంటే సింగర్ ధీకి చాలా ప్రత్యేకమైన వాయిస్. ఆమెను ఎవ్వరూ ఇమిటేట్ చేయలేరు. ఆమె చాలా టాలెంటెడ్. వయస్సులో కూడా చాలా చిన్నది. మున్ముందు ఫ్యూచర్‌లో వంద మంది చిన్మయిల్ని, శ్రేయా ఘోషాల్ని బీట్ చేస్తుంది’ అంటూ పొగిడేసింది చిన్మయి. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version