Site icon NTV Telugu

‘తప్పు చేశాను’ అంటున్న శింబు!

Simbu turns singer again for new music director

బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి తండ్రి లానే సకల కళావల్లభుడు అని పించుకున్నాడు శింబు. తండ్రి టి. రాజేందర్ అంత కాకపోయినా… కొన్ని శాఖలలో అయిన శింబు తన ప్రావీణ్యం బయటపెడుతూ ఉంటాడు. తాజాగా శింబు ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో ఇన్ వాల్వ్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా ఎ. కె. ప్రియన్ ను పరిచయం చేస్తూ, యువన్ శంకర్ రాజా తన యు1 రికార్డ్స్ బ్యానర్ లో మిత్రులతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నాడు. దీని కోసం విఘ్నేష్ రామకృష్ణన్ రాసిన పాటను, శింబుతో పాడిస్తున్నారు.

Read Also : ‘కన్నుగీటు పిల్ల’ కవ్వింపు మామూలుగా లేదుగా!?

ఇటీవల యువన్ శంకర్ రాజా కొన్ని ఫోటోలను జత పర్చి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు. తన కోరిక మేరకు సోదరుడు శింబు ఈ పాటను పాడుతున్నాడని చెప్పాడు. దీనిని కాళిదాస్, మేఘా ఆకాశ్‌ పై డోంగ్లీ జుంబో డైరెక్షన్ లో పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు ‘తప్పు పనితెన్’ అనే పేరు ఖరారు చేసినట్టు యువన్ శంకర్ రాజా ఈ రోజు తెలిపాడు. దీని అర్థం ‘తప్పు చేశాను’ అని. సో… ఈ పాటను పాడించడం ద్వారా శింబుతో ‘తప్పు చేశాను’ అని యువన్ శంకర్ రాజా చెప్పించబోతున్నాడన్న మాట!

Exit mobile version