Site icon NTV Telugu

Simbu : మణిరత్నం నన్ను పూర్తిగా మార్చేశాడు..

Shimbu Manirathnam

Shimbu Manirathnam

ఎప్పుడు ఏదో ఓ విషయంపై వార్తల్లో నిలిచే కోలీవుడ్ హీరోల్లో శింబు ఒకరు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా నెగెటివ్ రీజన్లతో అతని మీద ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉండేది. షూటింగ్‌కు సరైన సమయానికి రాడని.. నిర్మాతలను ఇబ్బంది పెట్టే వాడని చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అతడిపై నిషేధం విధించాలని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఇలాంటి శింబును.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం పూర్తిగా మార్చేశాడట.

Also Read : Sara Tendulkar : మరో స్టార్ యాక్టర్‌తో.. సారా టెండూల్కర్ డేటింగ్ !

మణిరత్నం దర్శకత్వంలో ఇంతకుముందు ‘నవాబ్’ సినిమా చేసిన శింబు.. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ కూడా నటించారు.ఇక ఈ రెండు చిత్రాల్లో మాత్రం చాలా పద్ధతిగా టైం కి వచ్చి షూటింగ్ చేయడమే కాక.. నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట శింబు. అయితే తాజాగా ఇదే విషయం ‘థగ్ లైఫ్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ఒక విలేకరి ప్రశ్నించారు.. మణిరత్నం సినిమాకు మాత్రం ఎలా గుడ్ బాయ్‌గా మారిపోయారు అని అడిగితే.. శింబు సమాధానం ఇస్తూ..

Also Read : Lokesh : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ డైరెక్టర్..?

‘ఒక సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలి అంటే దర్శకుడి చేతిలో ఉంటుంది. మణిరత్నం అంత పెద్ద దర్శకుడు అయినప్పటికీ.. అందరి కంటే ముందు షూటింగ్‌కు వచ్చేవారు. అది చూసి నేను కూడా క్రమశిక్షణతో మెలిగాను. అందరు డైరెక్టర్‌ల లాగా సెట్‌కు వచ్చాక ఈ సీన్ ఎలా చేద్దాం అని ఆయన డిస్కస్ చేయరు. ఏం చేయాలో ముందే పూర్తి స్పష్టతతో వచ్చేస్తారు. చిన్న కన్ఫ్యూజన్‌ కూడా ఉండదు. ఏదైనా మార్పు చేయాలన్నా.. ఏదైనా చెప్పాలన్నా మానిటర్ దగ్గర కూర్చుని అరవడం ఉండదు. మనం ఎంత దూరంలో ఉన్నా ఆయనే దగ్గరికి వచ్చి వివరిస్తారు. మణిరత్నం అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన లాంటి దర్శకులే నా కెరీర్ లో ఉండి ఉంటే.. నేను మరిన్ని సినిమాలు చేసేవాడిని. అభిమానులను సంతోష పెట్టేవాడిని. మణి సార్ నాతో ఎన్ని సినిమాలు చేస్తానన్నా నేను సిద్ధమే’’ అని శింబు తెలిపారు. ప్రజంట్ అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version