NTV Telugu Site icon

Sidhu Jonnalagadda : అప్పుడు కనీకనిపించని పాత్ర.. ఇప్పుడేమో అతిధి పాత్ర!

Sidhu Jonnalagadda Raviteja Movie

Sidhu Jonnalagadda Raviteja Movie

Sidhu Jonnalagadda Cameo on Raviteja New Movie: సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒక వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే డీజే టిల్లు సినిమాతో హిట్ కొట్టి మరో హిట్టు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు సన్నిహితంగా మెలుగుతాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.

Ruhani Sharma: ‘హిట్స్’ లేకున్నా భలే ఛాన్స్ పట్టిందే!

అది పెద్ద విషయం ఏం కాదు అయితే ఆ సినిమా మరేమిటో కాదు రవితేజ హీరోగా రైటర్ భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న కామెడీ టచ్ ఉన్న సినిమానే. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే సిద్దు జొన్నలగడ్డ కెరియర్ స్టార్టింగ్ లో రవితేజ డాన్ శీను సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అది కూడా మనం ఇప్పుడు గుర్తుపడితే తప్ప అతను సిద్దు జొన్నలగడ్డ అనే విషయం అర్థం కాదు. అలా ఒకప్పుడు తాను ఏ స్టార్ హీరో సినిమాలో అయితే చిన్న పాత్ర చేశాడో ఇప్పుడు అదే స్టార్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఒకరకంగా ఇది సిద్దు జొన్నలగడ్డ లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పవచ్చు.

Show comments