Site icon NTV Telugu

‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Siddharth first look revealed from Mahasamudram

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తుండగా… అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు కామ్ అండ్ కంపోస్డ్ యాక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ సాధారణ యువకుడిలా కనిపిస్తున్నాడు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ చాలాకాలం తరువాత నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం నుంచి ఇటీవలే శర్వానంద్, అదితి రావు హైదరిల ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. కాగా ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version