NTV Telugu Site icon

Shruti Hassan: వద్దు వద్దంటూనే ప్రేమలో శృతి హాసన్?

shruti hassan

shruti hassan

Shruti Hassan in Love Again Rumours : శృతిహాసన్ ఇప్పటికే ఇద్దరు బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకుంది. ఈ మధ్యనే ఆమె తాజా మాజీ ప్రియుడు శాంతను హజారికాతో నాలుగేళ్ల రిలేషన్ తర్వాత బ్రేకప్ చేసుకున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆమె సమాధానం ఇస్తూ తాను ప్రస్తుతం సింగిల్ అని మింగిల్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పుకొచ్చింది. ఆమె మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో ఎవర్ని డేటింగ్ చేయబోదు అని అనుకున్నారు.

SSMB29: అబ్బే.. ఇప్పట్లో కష్టమేనమ్మా!

కానీ ఆమె మరోసారి రిలేషన్ లోకి అడుగు పెట్టే దిశగా పరుగులు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆమె కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నానని చెబుతూ వచ్చింది. దాని ప్రకారం ఆమె ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలి సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కూతురు పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అయితే ఆమె మరోసారి రిలేషన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమేనా? నిజంగానే ఆమె మరో రిలేషన్ లో అడుగుపెడుతుందా? అనే విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Show comments