Site icon NTV Telugu

Shruti Haasan: రాజకీయాల్లోకి శృతిహాసన్ ఎంట్రీ .. ఈసారి గట్టిగా ఇచ్చిన భామ..!

Shruti Haasan

Shruti Haasan

సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు..ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది..

అయితే కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే… మక్కల్‌ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. ఈ విషయంపై శృతికి పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించగా… ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు..

సినిమాల్లోనే నటిస్తానని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రానని మరసారి గట్టిగా చెప్పేసింది.. ఇకపోతే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్‌ సరసన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు.. త్వరలోనే ఓ ఆల్బమ్ ను కూడా విడుదల చెయ్యనున్నట్లు తెలిపింది..

Exit mobile version