డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్న కూతురు శివాత్మిక. అక్క శివానీ కంటే ముందే కథానాయికగా తెలుగువారి ముందుకు వచ్చింది. ‘దొరసాని’ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన శివాత్మిక ఇప్పుడు ‘పంచతంత్రం’ అనే మూవీలో లేఖ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. ఎల్లో శారీ ధరించి, పక్కింటి అమ్మాయిని తలపించేలా అందులో శివాత్మిక ఉంది. అయితే… నవతరం భావాలు తనలో దాగున్నాయనే విషయాన్ని శివాత్మిక చెప్పాలనుకున్నట్టుగా ఉంది. శనివారం ఓ కలర్ ఫుల్ గ్లామర్ స్టిల్ ను రిలీజ్ చేసింది. ‘దొరసాని’, ‘పంచతంత్రం’ చిత్రాల్లోని పాత్రలు తనను ఇమేజ్ చట్రంలో ఇరికించేస్తాయని శివాత్మిక భావించిందేమో, గ్లామర్ పాత్రలకూ తాను సై ఈ ఫోటోలతో చెప్పకనే చెప్పేసింది రాజశేఖర్ తనయ!!
శివాత్మిక నిన్న అలా… ఇవాళ ఇలా!
