Site icon NTV Telugu

Rakshith Atluri: డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!

Sasivadane

Sasivadane

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి.

Also Read:The Girl Friend: నిన్న ఎంగేజ్మెంట్.. నేడు రిలీజ్ డేట్

ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టు ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాలను అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. గౌరీ కాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కోమలి అద్భుతమైన నటి. తేజకి, అభిలాష్ కి మంచి సక్సెస్ రావాలి. సాయికి డైరెక్టర్‌గా మంచి పేరు రావాలి. కెమెరామెన్ సాయికి ఆల్రెడీ ప్రశంసలు వస్తున్నాయి. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమా చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ నిరాశ పరచదు అని మాత్రం చెప్పగలను. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండన్నారు.

Exit mobile version