NTV Telugu Site icon

Ram Pothineni: మరొక డీల్ క్లోజ్ చేసిన ఇస్మార్ట్ ..ఎన్ని కోట్లో తెలుసా..?

Untitled Design (19)

Untitled Design (19)

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రానున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వీరిరువురి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ శంకర్ కు కొనసాగింపుగా రాబోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ పై ఆటు రామ్ అభిమానుల్లోనూ ఇటు పూరి జగన్నాధ్ ఫ్యాన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. షూటింగ్ ముగించి అన్ని హంగులతో ఆగస్ట్ 15, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

కాగా డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ అనుకున్నదానికంటే డబుల్ స్థాయిలో జరిగింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ రూ. 56 కోట్లకు నిర్మాత నిరంజన్ రెడ్డి కొనిగొలు చేయగా, హిందీ రైట్స్ 6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఓటీటీ రైట్స్ 33 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఆడియో రైట్స్ 9 కోట్ల రూపాయలకు ఆదిత్య మ్యూజిక్ కు సేల్ చేసారు నిర్మాత ఛార్మి. ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ తెలుగు శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ రేటుకి జీ తెలుగు తెలుగు రైట్స్ కొనుగోలు చేసిందని సమాచారం.

స్వాతంత్రదినోత్సవం కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం మిస్టర్ బచ్చన్ నుండి పోటీ ఎదుర్కొనబోతుంది. కాగా నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ పంపిణి చేస్తుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న ఈ చిత్రంలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా ‘క్యా లాఫ్ డా’ అంటూ సాగే పాటను ఈ రోజు విడుదల చేయనున్నారు మేకర్స్.

Also Read : Ajith Kumar: మరోసారి అజిత్ vs అర్జున్..మ్యాటర్ ఏంటంటే..?

Show comments