కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ నిర్మించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సీక్వెల్స్ విషయంలో తమిళ చిత్రసీమలోని బడా స్టార్లకు అస్సలు కలిసిరావడం లేదు. ఎన్ని పరాజయాలు ఎదురైనా తమిళ తంబీలు మాత్రం ఈ సీక్వెల్ వ్యామోహాన్ని వదులుకోలేకపోతున్నారు.
తమిళ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ ఇండస్ట్రీ హిట్ కొడితే సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. వాటిలో స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘సామి’ సూపర్ హిట్ కానీ సామి 2 ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అలాగే కమల్ హాసన్ భారతీయుడు ఇండస్ట్రీ హిట్ అయితే సీక్వెల్ గా వచ్చిన ‘ఇండియన్ 2’ ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తీసిన ‘రోబో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయగా సీక్వెల్ గా వచ్చిన రోబో 2.0 వసూళ్లు సాధించినప్పటికీ, మొదటి భాగం తెచ్చిన క్లాసిక్ టాక్‌ను దక్కించుకోలేక మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఇక లేటెస్ట్ గా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘సర్దార్’కు సీక్వెల్ గా కార్తీ ‘సర్దార్ 2’ తో వచ్చాడు. కానీ ఫలితం మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేక ఫెయిల్యూర్ వైపు పయనిస్తోంది. ఈ క్రమంలోనే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తలైవర్ రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ‘జైలర్’ సాధించిన సంచలన విజయం దృష్ట్యా ఈ సీక్వెల్‌తో రజనీకాంత్ తమిళ సీక్వెల్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తారో లేదో అక్టోబర్ 15 తర్వాత తెలుస్తుంది.

