Site icon NTV Telugu

కార్తీ కోసం పవర్ ఫుల్ లేడీ విలన్ ?

Senior Actress Simran to Turn villain for Karthi

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటీమణులలో నిన్నటితరం హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్, అజిత్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల్లో వైవిధ్యభరితంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. తాజాగా ఈ నటీమణి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తదుపరి చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Read Also : అర్జున్ కపూర్ కు మలైకా స్పెషల్ విషెష్

కార్తీ ప్రస్తుతం “సర్దార్” అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా నిర్మించబడిన ఈ చిత్రానికి పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సిమ్రాన్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తనుందట. ఆమె పాత్ర చాలా ఉత్కంఠభరితమైన అంశాలతో నిండి ఉందని, అందుకే ఈ పాత్రకు ఆమె వెంటనే ఆమెకు ఆమోదం తెలిపిందని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక విక్రమ్ ‘ధృవ నట్చత్రం’, మాధవన్ ‘రాకెట్ట్రీ’, ‘అంధాదున్’ తమిళ రీమేక్ లలో కూడా సిమ్రాన్ కనిపించనున్నారు.

Exit mobile version