Site icon NTV Telugu

మొన్న కొడుకు, నేడు భర్త… తీవ్ర దుఃఖంలో సీనియర్ నటి

Senior Actress Kavitha Husband Passed Away due to Covid-19

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూసినట్టు సమాచారం.

Read Also : తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి

ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రాండ్రం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించారు కవిత. ఇప్పుడు ఈ సీనియర్ నటి చాలా తక్కువ కాలం గ్యాప్ లో కొడుకుని, భర్తను కోల్పోవడం విషాదకరం. దశరథ్ మరణించారన్న వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version