Site icon NTV Telugu

‘మా’ ఎలక్షన్స్ : ప్రకాష్ రాజ్ కు మరో సీనియర్ హీరో సపోర్ట్

Senior actor Suman supports Prakash Raj

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండగానే పరిస్థితులు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. “మా” ఎలక్షన్స్ లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 5 మంది ‘అధ్యక్ష’ పదవికి పోటీగా దిగుతున్నారు. అందులో యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్, హేమ, మరో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో మంచు విష్ణుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ సపోర్ట్ ఉన్నట్టు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక్షంగానే వెల్లడించారు. జీవిత, హేమలకు పెద్దగా సపోర్ట్ లేకపోయినా ఇప్పటికే “మా”లో పలు పదవుల బాధ్యలు నిర్వహించిన వారు తమకు అసోసియేషన్ నిర్వహణలో అనుభవం ఉందని, అంతేకాకుండా ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలంటూ పోటీకి దిగారు. మరోవైపు సీవీఎల్ నరసింహారావు తెలంగాణవాదంతో ముందుకెళ్తున్నారు. ఆయనకు విజయశాంతి తన సపోర్ట్ ను ప్రకటించారు.

Read Also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ నోటీసులు..!

ఇదంతా ఇలా ఉండగా… ప్రకాష్ రాజ్ విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఆపోజిట్ గా నిలబడిన సభ్యులు నాన్ లోకల్ అంటూ మండిపడుతున్నారు. ఈ నాన్ లోకల్ ఇష్యూ ఇలా కొనసాగుతుండగానే… మరో నాన్ లోకల్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు. సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ ఒక నటుడి పోర్ట్‌ఫోలియోలో నాన్-లోకల్ లాంటిదేమీ ఉండదని, నటుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినవాడని, ‘మా’ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని నేను సమర్థిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్న ప్రకాష్ రాజ్… తెలంగాణ, మహబూబ్ నగర్ లోని ఓ ఊరిని దత్తత తీసుకుని, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

Exit mobile version