Site icon NTV Telugu

Seethannapet Gate : ఏప్రిల్ 4న థియేటర్లలోకి “సీతన్నపేట గేట్”!

Seethannapet Gate

Seethannapet Gate

వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “సీతన్నపేట గేట్”. ఈ సినిమాను వైఎంఆర్ క్రియేషన్స్ మరియు ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై రాజ్ కుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు.

డైరెక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ – మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మన సమాజంలో చాలా వరకు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇవి అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సీతన్నపేట గేట్ సినిమాను రూపొందించాను. తెలుగు, కన్నడలో స్టార్ హీరోస్ తో సినిమాలు రూపొందించిన ఆర్ఎస్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థలో నేను మూవీ చేయడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్స్ తో సీతన్నపేట గేట్ సినిమా కథనం సాగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

Exit mobile version