యాక్షన్ కింగ్ అర్జున్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. హీరోగా నటిస్తూనే మెగా ఫోన్ కూడా పడుతుంటారు. ‘జైహింద్’ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ మరలా దర్శకత్వం వహించిన సినిమా ‘సీతా పయనం’. ఇందులో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన సీతా పయనం మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా నుంచి ఇదివరకే వచ్చిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సీతా పయనం సినిమాపై మంచి బజ్ ఉంది. అర్జున్ అన్నీ తానై ఈ సినిమాని చేశారట. మూవీ తప్పక మంచి విజయం సాధిస్తుందని అర్జున్ నమ్మకంగా ఉన్నారు.
Also Read: Vaibhav Sooryavanshi History: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఏకంగా 110 సిక్సర్లు!
సీతా పయన చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా.. స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీస్‌కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి. త్వరలో సీతా పయనం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు.
