ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సూపర్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. ఇప్పటికే ఆన్ లైన్ లో అందర్నీ అలరించిన బయోపిక్ సిరీస్ తాజాగా మరో అరుదైన ఘనత స్వంతం చేసుకుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందింది ‘స్కామ్ 1992’. ఈ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్నటువంటి 250 టాప్ టీవీ షో, సిరీస్ లలో 9.6 రేటింగ్ ఐఎండిబి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ) వెబ్ సైట్ రూపొందించిన ఆల్ టైం బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ టెలివిజన్ షోలో మొత్తం 163 పేర్లు ప్రతిష్ఠాత్మక పట్టికలో ఉండగా… ఇండియా నుంచీ చోటు దక్కింది కేవలం ఒకే ఒక్క సిరీస్ ‘స్కామ్ 1992’కు మాత్రమే. ‘స్కామ్ 1992’ హర్షద్ మెహతా జీవిత కథగా వచ్చిన ఈ రియలిస్టిక్ థ్రిల్లర్ నెటిజన్స్ ను మెస్మరైజ్ చేసేసింది. విడుదలైనప్పటి నుంచి ఇలా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
చరిత్ర సృష్టించిన “స్కామ్ 1992”
Show comments