టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. అనేక రిలీజ్ ల వాయిదాల అనంతరం మూడు సినిమాలు మధ్య పోటీగా జీబ్రా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది.ఆ
Also Read : Pushpa 2: నార్త్ అమెరికాలో పుష్పరాజ్ ర్యాంపేజ్ కంటిన్యూస్
ఇక ఈ సినిమా ఓవర్సీస్ టాక్ పరిశీలిస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలను చూపిస్తూ సాగిన కమర్షియల్ డ్రామా ఆకట్టుకుంది. ఎన్నో పరాజయాల తర్వాత హీరో సత్యదేవ్ తన మార్క్ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడనే టాక్ వస్తోంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కథ రచన మరియు టైట్ స్క్రీన్‌ప్లే, డీసెంట్ ఫస్ట్ హాఫ్ మరియు అద్భుతమైన సెకండాఫ్‌తో సూపర్ అనిపించింది. క్లైమాక్స్‌లో అన్ని పాయింట్స్ ను కనెక్ట్ చేసే విధానం చాలా బాగుంది. రవి బస్రూర్ అందించిన BGM మరియు మిక్సింగ్ పర్వాలేదు. హీరో సత్యదేవ్ మరియు హాస్యనటుడు సత్య మధ్య వచ్చే సీన్స్, కామెడీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటే, సినిమాలో వచ్చే థ్రిల్లర్ ఎపిసోడ్స్ మెప్పించాయి. కానీ అక్కడక్కడ అనవసరపు సన్నివేశాల్ని చేర్చి బోర్ కొట్టించాడు. కాస్త ల్యాగ్ అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది జీబ్రా. ప్రియా భవాని శంకర్ పరిధి మేరకు మెప్పించింది. ఓవరాల్ గా చేసుకుంటే మెప్పించే డ్రామా జీబ్రా.