NTV Telugu Site icon

‘సంకీర్తన’ నిర్మాత కన్నుమూత

Sankeerthana Movie Producer M. Gangaiah Passes Away

నాగార్జున, రమ్యకృష్ణ జంటగా రూపుదిద్దుకున్న ‘సంకీర్తన’ చిత్ర నిర్మాత డాక్టర్ యం. గంగయ్య బుధవారం రాజమండ్రిలో కన్నుమూశారు. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ‘సంకీర్తన’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా గీతాకృష్ణకు మంచి పేరు రావడంతో పాటు… ఆ తర్వాత ఆయన పలు భిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. నిర్మాత గంగయ్య మృతి పట్ల పలువురు నిర్మాతలు సంతాపం తెలియచేశారు.