NTV Telugu Site icon

MAZAKA : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ కిషన్ ‘మజాకా’

Mazaka

Mazaka

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ అలాగే ధనుష్ దర్శకత్వంలో రాయన్ సినిమా చేసాడు. రాయన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిషన్‌ ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది.

Also Read : Thandel : బన్నీ మాటలను మరోసారి నిజం చేసిన దేవిశ్రీప్రసాద్..

త్రినాథ రావు దర్శకత్వలో రానున్న మజాకా  అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ గురించి ఇండస్ట్రీ లో చాలా కాలంగా మంచి టాక్  నడుస్తోంది. మజాకా మొదట ఈ సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  కామెడీ ప్రధానంగా వస్తున్న ఈ సినిమా సందీప్ కిషన్ కు మరో హిట్ ను తన ఖాతలో వేస్తునందని టాక్ నడుస్తోంది. రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.